పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భాగత్ సింగ్’ పై అప్పుడే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోలు ఈ సినిమా ఎంత స్టైల్, ఎనర్జీతో ఉంటుందో చెప్పేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ “దేఖ్ లేంగే” సాంగ్ ప్రమోను విడుదల చేసి, ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేశారు. పూర్తి పాట ఈ నెల 13న విడుదల కానుంది.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో మొత్తం మాస్ బీట్ అందుకే ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది… “రం పమ్ పమ్” అనే హుక్ పల్లవి తో సాంగ్‌కి అదిరిపోయే కిక్ తెచ్చేశాడు.
భాస్కరభట్ల రాసిన “స్టెప్ ఏస్తే భూకంపం…” లాంటి లైన్లు స్క్రీన్‌పై భారీ డాన్స్ మూమెంట్స్, పవర్‌ప్యాక్ స్టెప్స్ వస్తున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి.
డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రకంగా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు. తాజాగా లీకైన స్టెప్స్, సిగ్నేచర్ హ్యాట్ మూవ్స్‌తో పవన్ కళ్యాణ్ యంగ్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఈ సాంగ్‌ను ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద డాన్స్ బస్టర్ అంటుండటానికి కారణం అదే!
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్‌గా శ్రీలీల మెరిస్తుండగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది.