‘మోగ్లీ’ నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన సెన్సార్ బోర్డు వ్యాఖ్యలపై ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ స్పందించింది. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యి అభిమానులు ఆందోళన చెందారు. నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ, నటుడు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నారని తెలిపారు.మోగ్లీనటుడు బండి సరోజ్ కుమార్ చేసిన సెన్సార్ బోర్డు వ్యాఖ్యలపై ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ స్పందించింది. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యి అభిమానులు ఆందోళన చెందారు. నిర్మాణ సంస్థ సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ, నటుడు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరిస్తున్నారని తెలిపారు.
బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘మోగ్లీ’ ఈవెంట్లో సరోజ్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో అసభ్యత లేదు. కానీ నా నటన చూసి సెన్సార్ బోర్డు ఆఫీసర్ భయపడ్డాడు. అందుకే ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది’’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో, చిత్రబృందం వెంటనే స్పందించింది. సెన్సార్ బోర్డు పట్ల గౌరవం ఉందని, సినిమా ప్రదర్శనలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.