16/06/2026
CM Revanth Reddy Inaugurates Netflix Eyeline Studios In Hyderabad, Invites Expansion In Bharat Future City

CM Revanth Reddy Inaugurates Netflix Eyeline Studios In Hyderabad, Invites Expansion In Bharat Future City

నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్‌ఫ్లిక్స్ సైతం కార్పొరేట్ కార్యాలయాన్ని ఈ మహానగరానికి మార్చుకోవాలని కోరారు.

📽️హైదరాబాద్‌లో అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి గారు మంత్రి
Sridhar Babu Duddilla గారితో కలిసి ప్రారంభించారు. #EyelineStudios ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుంది.

📽️ఈ స్టూడియో ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నందుకు అభినందనలు. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చేసింది.

Image

📽️ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న #BharatFutureCity లో రీజనబుల్ సైజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌ విస్తరణ కోసం స్థలం కేటాయిస్తాం. అవసరమైతే నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు రీలొకేట్ చేయాలి.

📽️ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నోకలర్, అక్కడి నుంచి ఈస్ట్‌మన్ కలర్, తర్వాత 70 ఎంఎం, డాల్బీ, అక్కడి నుంచి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎదిగింది. ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ రావాలని ఎప్పుటినుంచో బలంగా కోరుకుంటున్నా.

📽️ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావాలన్నది మా ఆకాంక్ష. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది.

📽️#Netflix ప్రపంచానికి వినోదం అందించాలని చూస్తోంది. మేం ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నాం. మీకూ మాకు మధ్యన సారూప్యత ఉంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని సంస్కృతులను ప్రజలను ఆహ్వానిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్‌వేలుగా పనిచేయడానికి దోహదపడుతాయి.

📽️డీవీడీలను అద్దెకు సమకూర్చే స్థాయి నుంచి ఓటీటీ లో ప్రపంచ లీడర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఎదిగింది. ఫుడ్, ట్రావెల్, వారసత్వం, సంస్కృతి విషయాల్లో ప్రజలు నెట్‌ఫ్లిక్స్‌ను, హైదరాబాద్‌ను ప్రేమిస్తారు. ప్రపంచ వీక్షకులకు తెలంగాణను విశ్వవ్యాప్తం చేయడంలో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది.

📽️నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మీద దృష్టిని సారించింది. స్పోర్ట్స్‌లో ఈ సంస్థ అతిపెద్ద బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని స్థాయిల్లో ట్యాలెంట్‌ను గుర్తించాలన్న లక్ష్యంతో క్రీడల పట్ల, క్రీడాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పింది. మీకూ మాకూ ఎంతో సారూప్యత కలిగిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ – హైదరాబాద్‌ రెండూ కలిసి మంచి విజయాలను అందిపుచ్చుకోవాలి.

📽️నెట్‌ఫ్లిక్స్‌కు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాకారం అందిస్తాం. భారత్‌, తెలంగాణ భవిష్యత్తులో ప్రపంచస్థాయి వినోదాన్ని అందిస్తాయనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. మనం కలిసి భవిష్యత్తుపై బలమైన ముద్ర వేద్దాం…” అని పిలుపునిచ్చారు.

📽️ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో #EyelineStudios సీఈఓ జెఫ్ షపిరో గారు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు గారు, సినీ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారితో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read  విజయనగరం ఎస్పీ బంగ్లాకు సంక్రాంతి శోభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *