తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
మధ్యతరగతి కారు…మారుతీ భలేచౌకసారు
భారత ఆటోమొబైల్ చరిత్రలో మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే అది మారుతి 800. ఇప్పుడు అదే కారు 1984 నాటి పాత…
భారత ఆటోమొబైల్ చరిత్రలో మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేసిన కారు ఏదైనా ఉందంటే అది మారుతి 800. ఇప్పుడు అదే కారు 1984 నాటి పాత…
బాబుపై రోజా ఫైర్…పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…
వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…
Sai Dharam Tej Showers Love On Mega Family…
2. Prabhas Is My Darling And Humble & Sweetest Person 3. Sai Dharam Tej Hopes To Share The Screen With…
2. Prabhas Is My Darling And Humble & Sweetest Person 3. Sai Dharam Tej Hopes To Share The Screen With…