తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది…
సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది… సెప్టెంబర్ లో వచ్చిన మిరాయి, లిటిల్ హార్ట్స్, కిష్కింధపూరి ఇంకా పవన్ OG సినిమాలు అద్భుతంగా ఆడాయి… ఇక…
సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది… సెప్టెంబర్ లో వచ్చిన మిరాయి, లిటిల్ హార్ట్స్, కిష్కింధపూరి ఇంకా పవన్ OG సినిమాలు అద్భుతంగా ఆడాయి… ఇక…
వినాయక చవితి విశిష్టత…ఎందుకు జరుపుకుంటారు?
భారతీయ సంస్కృతిలో వినాయక చవితి ఒక మహోన్నత పండుగ. ఈ రోజు గణపతి బాబా అవతరించిన పర్వదినంగా భావిస్తారు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ, దేవాలయాలలోనూ పెద్దయెత్తున…
భారతీయ సంస్కృతిలో వినాయక చవితి ఒక మహోన్నత పండుగ. ఈ రోజు గణపతి బాబా అవతరించిన పర్వదినంగా భావిస్తారు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ, దేవాలయాలలోనూ పెద్దయెత్తున…
బడ్జెట్‌పై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతున్నది?
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్‌పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి…
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్‌పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి…