ఈ సంక్రాంతికి అసలు సినిమాల జాతర మొదలవ్వబోతోంది… ఒక పక్క డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ ‘ది రాజా సాబ్’, ఇంకో పక్క మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్’, ఇంకా విజయ్ జన నాయకన్, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’, ఇంకా రవి తేజ సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు, శివ కార్తికేయన్ పరాశక్తి, ఇలా అరడజన్ సినిమాలు ఉన్నాయ్… అందుకే రిలీజ్ డేట్స్ దెగ్గర పడుతున్నాయి కాబట్టి, ప్రమోషన్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది.
ఇక ఇందాకే మన శంకర వర ప్రసాద్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు… ఇంకా సినిమా రిలీజ్ కి 25 రోజులే ఉండడం వల్ల, ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఆలా ఆ మేకింగ్ వీడియో వీడియో లో నయనతార, చిరు, అనిల్ రావిపూడి, అందరు సెట్ లో సందడి చేస్తూ కనబడ్డారు!

సో, మొత్తానికి ఈ సినిమా ఒక ఫామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది! ఈ సినిమా ని సాహు గారపాటి ఇంకా సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.