ప్రపంచంలో అత్యధికమంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్‌కి అత్యంత అధరణ ఉంది. ప్రపంచ కప్‌తో పాటు వివిధ రకాల టోర్నమెంట్లు జరుగుతుంటాయి. ఒక బంతి కోసం రెండు జట్లు పోటీపడి మరీ పరుగులు తీస్తూ గోల్ కోసం ప్రయత్నం చేస్తుంటాయి. 22 మంది మధ్యలో ఒక బాల్‌ను తన్నుతూ గోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ వినూత్న రీతిలో గోల్ చేయాలి అంటే దానికి ఎంతో సాధన అవసరం. అద్భుతంగా గోల్స్ చేయగల క్రీఢాకారుల లిస్ట్‌లో మనకు పీలే, రోనాల్డొ, రోనాల్డిన్హో, డియాగో మారడోనా, మెస్సీ, డి మారియా, కాకా వంటి ప్లేయర్స్ మనకు కనిపిస్తుంటారు. ఆరోజుల్లో పీలే, డియాగో మారడోనా ఆడిన ఆట నేటికి మనకు గుర్తుండిపోయింది. ఇటీవల కాలంలో మెస్సీ చేసిన గోల్స్ వావ్ అనిపిస్తుంటాయి. అయితే, వీటిన్నింటిని మించేలా ఒక తరంగం ఆకృతిలో బాల్ గాలిలోనే తన దిశను మార్చుకుంటూ వెళ్లి గోల్స్ పోస్ట్‌లో పడుతుంది. ఇలా గోల్ చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత, గ్రీన్‌మ్యాట్ సంస్కృతి ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఏదైనా సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఇది జస్ట్ ఫన్ కోసమే క్రియేట్ చేసిందే. అయినప్పటికీ చూసేవారిని నిజంగానే ఇలా కూడా గోల్ చేయవచ్చా అని ఆలోచించే విధంగా చేస్తుంది ఈ వీడియో. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఈ వీడియో క్రీఢాభిమానులను అలరిస్తోంది. మీరుకూడా ఓ లుక్ వేయండి.
Related Posts

ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకునేది ఎవరు?
ప్రపంచ సుందరి పోటీ 2025: తుది ఫలితం శనివారం తేదీ, సమయం, వేదిక: బహుమతులు: ఎంపిక ప్రక్రియ న్యాయనిర్ణేతలు విజేత పేరు ప్రకటించేది జూలియా మోర్లీ.స్టిఫానీ డెల్వ్యాలీ…
ప్రపంచ సుందరి పోటీ 2025: తుది ఫలితం శనివారం తేదీ, సమయం, వేదిక: బహుమతులు: ఎంపిక ప్రక్రియ న్యాయనిర్ణేతలు విజేత పేరు ప్రకటించేది జూలియా మోర్లీ.స్టిఫానీ డెల్వ్యాలీ…

Tirumalaలో శిలాతోరణం ఎక్కిన చిరుత
గోవిందా గోవిందా అంటూ నిత్యం లక్షలాది మంది భక్తులు Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వ్యయప్రయాసలుకోర్చి ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. తనను నమ్మి తనకోసం వచ్చిన భక్తులను…
గోవిందా గోవిందా అంటూ నిత్యం లక్షలాది మంది భక్తులు Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వ్యయప్రయాసలుకోర్చి ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. తనను నమ్మి తనకోసం వచ్చిన భక్తులను…

Food మనిషికి ఎందుకు అవసరం? శక్తి, ఆరోగ్యం, జీవన రహస్యాలు
కూటి కోసమే కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పనిచేసినా చేతివేళ్లు నోట్లోకి వెళ్లేందుకే. మనిషికి ఆకలంటూ లేకుంటే ఏ పని చేయకుండా హాయిగా ఉండిపోతాడు. కానీ,…
కూటి కోసమే కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పనిచేసినా చేతివేళ్లు నోట్లోకి వెళ్లేందుకే. మనిషికి ఆకలంటూ లేకుంటే ఏ పని చేయకుండా హాయిగా ఉండిపోతాడు. కానీ,…