భారతదేశంలోని ఆలయ వ్యవస్థ నేటికీ పదిలంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలిస్తే నిజంగా షాకవుతారు. నిర్మాణ శైలి, విగ్రహాల ప్రాణప్రతిష్ట, ఆకాశం నుంచి వెలువడే దైవిక తరంగాలను ఒడిసిపట్టి భూమిమీదకు ప్రసరింపజేసే గోపురాలు. ఇవన్నీ ఉన్న కారణంగానే ఆలయ వ్యవస్థ నేటికీ మనుగడలో ఉంది. వైభవోపేతంగా వెలుగుతున్నది. ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన చాలా దేవాలయాల్లో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి కర్ణాటకలోని తాలిలో ఉంది. కర్ణాటకలోని హోసా కన్నంబాడిలోని కృష్ణరాజ సాగర్ ఆనకట్టుకు సమీపంలో ఎప్పుడో హోయసల పరిపాలకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మురళీలోలుడిగా కనిపిస్తాడు. చూడముచ్చటగా ఉండే శ్రీకృష్ణుడి రూపం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే రూపం ఒకత్తైతే… కన్నయ్య మురళి వాయిస్తున్న శబ్ధం మనకు స్పష్టంగా వినిపిస్తుండం మరొక ఎత్తు.
ఈ మురళి శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే, మురళి నుంచి వచ్చే ఆ శబ్ధం శ్రావ్యబద్ధంగా, ఆహ్లాదంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. ఇటుంటి ఈ ఆలయం సుమారు 70 ఏళ్లపాటు నీటిలో మునిగిపోయింది అంటే నమ్మగలమా చెప్పండి. కానీ, ఇది అక్షరాల నిజం. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం దగ్గరలోనే కృష్ణరాజ సాగర్‌ను నిర్మించారు. ఈ సాగర్‌లోకి నీరు రావడంతో ఆలయం కూడా మునిగిపోయింది. సుమారు 70 ఏళ్లపాటు నీటిలోనే ఉండిపోయింది. అయితే, 2010లో బయటపడిన ఈ ఆలయాన్ని 2011లో పునరుద్ధరించారు. నాటి ఆలయాన్ని నేటి తరానికి అనుగుణంగా నిర్మించారు. ఆలయానికి రెండు వైపులా వరండాలతో కూడిన భవనం ఉంటుంది. ఈ భవనం చుట్టూ యాగశాలలు ఉంటాయి. ఆలయంలో ఓ వసారా, హాలు, వేడుకలు నిర్వహించేందుకు ముఖ్య మంటపం, గర్భగుడి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఎదురుగా ఉన్న గర్భగుడిలో కేశవుడి విగ్రహం, దక్షిణం వైపు ఉన్న గర్భగుడిలో గోపాలకృష్ణుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ కన్నయ్య ఆలయంలోని వేణువు శబ్ధాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చేధించలేకపోయారు. ఇది దైవరహస్యమని, దైవం తప్ప మరెవ్వరూ దీనికి సమాధానం ఇవ్వలేరిన అంటున్నారు.