సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ ఈరోజు విడుదల చేసింది. టీజర్ చూస్తే ఇది ఒక యాక్షన్–అడ్వెంచర్ కామెడీ డ్రామాగా రూపొందుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
టీజర్ కట్‌లో జనరేషన్ జీ (Gen Z) ఫ్లేవర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యువ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునేలా ఉంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయకుడి జీవన పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించే ఎగ్జైటింగ్ కథ ఉందని టీజర్ సూచిస్తోంది.
టీజర్ ప్రారంభంలో సందీప్ కిషన్ వాయిస్‌లో వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ప్రమాదాల మధ్య నుంచి తాను ఎలా బయటపడతానన్న భావనతో వచ్చే ఆ డైలాగ్ కథానాయకుడి క్యారెక్టర్‌ను బలంగా పరిచయం చేస్తుంది. స్టైల్, ఎనర్జీ, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ టీజర్‌లో ఉన్నాయ్.
థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత స్టైలిష్ టచ్ ఇచ్చింది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. రాజు సుందరం, అంబు థాసన్, యోగ్ జపి, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మగలక్ష్మీ సుధర్శనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్యాథరిన్ ట్రెసా ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనుంది.
సిగ్మా చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో విడుదల కానుంది.