టాలీవుడ్ పాపులర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈరోజు తన 44 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు… అందుకే అయన ఫాన్స్ ఇంకా కో-డైరెక్టర్స్, యాక్టర్స్ అందరు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతానికి డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…
వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన ఆయనకు ఈ ప్రత్యేక రోజున రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా హార్ట్-ఫెల్ట్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తమ రాబోయే చిత్రం ‘స్పిరిట్’ పై అంచనాలను మరింత పెంచారు.

“హ్యాపీ బర్త్‌డే బ్రో… నువ్వు ఏం సృష్టిస్తున్నావో అందరూ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ మాటలతో సినిమాపై, దర్శకుడిపై తనకున్న నమ్మకాన్ని, ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ ని పెంచేసాడు. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ఒక fearless పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటివరకు చూడని విధంగా పూర్తిగా రా, ఇంటెన్స్ అవతార్‌లో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.

ఇటీవల విడుదలైన వాయిస్ ఓవర్ గ్లింప్స్ ఒక్కటే సినిమాపై భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసింది. సినిమా ఎంత రా ఇంటెన్సిటీతో, ఎంత భారీ స్కేల్లో ఉండబోతోందో ఆ గ్లింప్స్ స్పష్టంగా సంకేతాలిచ్చింది.
ఇంకా వివేక్ ఆనంద్ ఒబెరాయ్ కూడా సందీప్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజెసారు…