రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తర్వాత, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు సినిమా అభిమానులకి ఒక సెలబ్రేషన్… ఎందుకు అంటే చిరంజీవి ఇంకా విక్టరీ వెంకటేష్ కలిసి డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా???
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మరోసారి తన ప్రతిభను చూపిస్తూ డైనమిక్ బీట్స్, ఉత్సాహభరితమైన సంగీతంతో ఫుట్-టాప్పింగ్ నంబర్‌ను అందించారు. వెంకీ మెగాస్టార్ కలిసి డాన్స్ చేస్తే సూపర్ అసలా… రెండు కళ్ళు చాలలేదు! వాళ్ళ డాన్స్, ఎనర్జీ ఇంకా జోష్… అబ్బో చూడాల్సిందే!
పాటలో సంక్రాంతి ఉత్సవాల స్పిరిట్ మాత్రమే కాకుండా, చిరంజీవి ఇంకా వెంకటేష్ మాస్‌స్టార్డమ్ ఉత్సాహాన్ని పెంచింది!
‘అధిరిపోద్దీ సంక్రాంతి’ లైన్‌కు తగ్గట్టే, ఈ పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. సింగెర్స్ నకాష్ అజీజ్ ఇంకా విషాల్ దాద్లాని తమ శక్తివంతమైన, హై-పిచ్ వాకల్స్‌తో పాటకు అదనపు ఉత్సాహాన్ని చేకూర్చి, పాటను మరింత ఇన్ఫెక్టియస్‌గా మార్చారు.
ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా 12th జనవరి న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!