‘లెగసీ’తో మరోసారి మాస్ అవతార్‌లో విశ్వక్ సేన్

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ మరోసారి బోల్డ్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘లెగసీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటెన్స్ రాజకీయ డ్రామాగా రూపొందుతోంది. న్యూ ఇయర్ రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. డార్క్, గ్రిట్టి ప్రపంచాన్ని చూపిస్తూ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపింది.

ఈ కథలో సిద్ధార్థ్ అనే యువకుడి పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. తన తండ్రి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అనివార్యంగా స్వీకరించాల్సిన పరిస్థితుల్లో సిద్ధార్థ్ జీవితం ఎలా మారుతుంది అన్నదే కథాంశం. టీజర్‌లో తండ్రి స్మారక సభ వద్ద విశ్వక్ సేన్ కనిపించే సన్నివేశాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. చాలా రా, రూడ్ నేచర్ ఉన్న పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లోని లోభం, మోసం, అధికారం కోసం జరిగే ఆటలను ఈ పాత్ర ఎలా ఎదుర్కుంటుందన్నదే సినిమాకి ప్రధాన బలం అనిపిస్తోంది.

టెక్నికల్‌గా కూడా లెగసీ చాలా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కినట్టు టీజర్ చెబుతోంది. సినిమాటోగ్రాఫర్ జిజు సన్నీ విజువల్స్ డార్క్ టోన్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేశాయి. ప్రతి ఫ్రేమ్ కూడా కథలోని నెగటివ్ షేడ్స్‌ను బలంగా చెప్పేలా ఉంది. ఇక 96 సినిమాతో ఫేమస్ అయిన గోవింద్ వసంత ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హాంటింగ్ ఫీల్ తీసుకొచ్చింది.

ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రావు రమేష్, కే కే మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

యేశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదాలు కలాహి మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంజయ్ సామ్బ్రాణి, వి.వి.ఎన్ ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బలమైన కథ, పవర్‌ఫుల్ క్యాస్ట్, హై ప్రొడక్షన్ విలువ్స్‌తో లెగసీ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *