దిల్ దియా ఫస్ట్ లుక్ చుస్తే షాక్ అవ్వాల్సిందే…

ఇప్పటి వరకు మనం తెలుగు లో సందీప్ రెడ్డి వంగ నే బోల్డ్ డైరెక్టర్ అనుకున్నాం… కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి ఫ్రెండ్ కూడా అలానే ఉన్నదే అని అనేక మానదు!

ఈరోజు ‘దిల్ దియా – ఎ నేకడ్ ట్రూత్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఈ చిత్రానికి స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తుండటం సినిమాపై మొదటి నుంచే ఆసక్తిని పెంచింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తే, అసలు బోల్డ్ అంటే ఇది అనచ్చు!

పూర్ణ నాయుడు నిర్మాణంలో, శ్రేయాస్ చిత్ర – ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె. క్రాంతి మాధవ్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇంతకుముందు ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో మానవ సంబంధాల లోతును ఆయన చాలా సున్నితంగా చూపించారు.

ఈ పోస్టర్ చాలా మినిమల్‌గా, బోల్డ్ గా ఉంది. హీరో చైతన్య రావు చైర్ పై ఆలా కూర్చోవడం మాములు విషయం కాదు! ఈ విజువల్ టోన్ దర్శకుడి ఆలోచనలకు పూర్తిగా తగ్గట్టుగా ఉంది. స్టైలిష్ హంగులు కన్నా, రియాలిటీ చూపించినట్టు ఉంది!

ఈ చిత్రంలో చైతన్య రావు మడాది, ఇరా, సాఖీ, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక సహాయ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ క్యాస్టింగ్ కూడా కథకు అవసరమైన సహజత్వాన్ని పెంచేలా ఉంది.

కొత్త బాక్సాఫీస్ గ్రామర్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్ 2026లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *