అసలే మన డార్లింగ్ ప్రభాస్ సినిమా… ఇంకా సంక్రాంతి బొమ్మ… ఇంకా ఒక హారర్ కామెడీ కథ… ఇలా ఇంకా ఇంకా ఇంకా అని చెప్పుకుంటూ పోతే చాల విషయాలే ఉన్నాయ్! ఐతే ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో టీం హుషారు గా ఉంది. అలానే మన హుషారు పెంచడానికి నిన్నే 1993 blockbuster ‘Disco Dancer’ సినిమా నుంచి “కోయి యహ నాచే నాచే…” సాంగ్ ని రీమేక్ చేసి ప్రభాస్ తో ముగ్గురు భామలు మాళవిక, నిధి, రిధి డాన్స్ చేసారు.
అసలే పార్టీ సాంగ్, ఇంకా డిస్కో బీట్ అబ్బో సాంగ్ అంత ప్రభాస్ డిస్కో నెంబర్ లో స్టెప్స్ వేసి, ముగ్గురు భామలతో రొమాన్స్ చేయడం, ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది!
ఒక్కో ప్రమోషన్ తో సూపర్ అనిపిస్తున్న రాజా సాబ్ సినిమా ఇంకా మూడు రోజుల్లో అంటే 9th న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!