తెలుగు వాడి కీర్తి దశ దిశల వ్యాపింప చేసిన మహోన్నవ్యక్తి,కృష్ణుడు,రాముడు ఇలానే ఉంటాడని చూపించిన మహానటుడు, తెలుగు రాజకీయాలను ప్రపంచానికి చెప్పిన రాజనీతిజ్ఞుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేసిన ఎమ్మెల్యే, “తెలుగు దేశం” పేరుతో పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడు అయిన కీర్తి శేషులు ఎన్టీఆర్ వర్ధంతి విజయనగరం లో జరిగింది. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కూతురైన కూటమి ఎమ్మెల్యే ఆదితీ గజపతిరాజు ఆధ్వర్యంలో నగరంలో కోట జంక్షన్, కాళ్ల నాయుడు మందిరం, కలెక్టరేట్ జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ మేరకు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ లు కోట జంక్షన్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం 100 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. తదుపరి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం 100 మందికి భోజనం పాకెట్లను పంపిణీ చేయడంతో పాటు నగరంలో నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్న వారికి మూడుపూటలా భోజనం ఏర్పాటు చేశారు.