టాలీవుడ్ హీరో నితిన్ తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన సినిమా చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఓ కొత్త ఎంటర్‌టైనర్ ని ఈరోజే అనౌన్స్ చేసి ఫాన్స్ ని ట్రీట్ చేసాడు! ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా, ఇది నితిన్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 36వ చిత్రం కావడం విశేషం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిత్తూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, రథసప్తమి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
సోషల్ మీడియా లో రిలీజ్ చేసిన క్రియేటివ్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. “No Body, No Rules” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం ఓ థ్రిల్లింగ్ సై-ఫై అనుభూతిని అందించబోతున్నట్టు స్పష్టంగా హింట్ ఇచ్చింది. ఊహాత్మక కథనాలు, కొత్తదనంతో కూడిన కాన్సెప్ట్‌లకు పేరుగాంచిన వి.ఐ. ఆనంద్, ఈసారి కూడా మంచి కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక పోస్టర్ నో నితిన్ సిగరెట్ కాలుస్తూ, పొగ మధ్యలో కనిపించాడు… మొత్తానికి నితిన్ కి ఇది గట్టి కం బ్యాక్ సినిమా కావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు!