మంచు మనోజ్ కం బ్యాక్ చాల స్ట్రాంగ్ గా చేసేసరికి ఇంకా నెక్స్ట్ అయన కెరీర్ లో మంచి సినిమాలు వచ్చి చేరుతున్నాయి. భైరవం సినిమా లో విలన్ గా చేసి, నెక్స్ట్ తేజ సజ్జ మిరై లో ‘బ్లాక్ స్వోర్డ్’ గా అదరగొట్టాడు… ఇక ఇప్పుడు పాట్రియాటిక్ సినిమా డేవిడ్ రెడ్డి చేస్తున్నాడు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్బంగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు…
శక్తివంతమైన పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మనోజ్. ఇప్పటికే విడుదలైన ‘వార్ డాగ్’ ఇంట్రడక్షన్ వీడియో నుంచే ఈ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమైంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచింది.
మంచు మనోజ్ ఎంతలా కట్టిపడేసాడు అంటే… తన బైక్ పై ఫుల్ ఫిట్ బాడీ తో, ఒక చేత్తో బైక్ నడుపుతూ, ఇంకో చేత్తో బేస్ బాల్ బాట్ పట్టుకుని రక్తం తో తడిసిన నెల కనిపిస్తాడు. అసలు ఈ ఫస్ట్ లుక్ లో మనోజ్ సూపర్…
బ్రిటిష్ ఇండియా కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ప్రతిష్టాత్మక బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మారియా ర్యాబోషాప్కా నటిస్తున్నారు. ఆమె పాత్ర కథకు కొత్తదనం, ఫ్రెష్ ఎనర్జీని జోడించనుందని చిత్రబృందం చెబుతోంది. మొత్తానికి డేవిడ్ రెడ్డి పాత్రతో మంచు మనోజ్ మరోసారి తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారని, ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.