సంక్రాంతికి రవి తేజ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కి కొంచం పాజిటివ్ టాక్ వచ్చి, డీసెంట్ హిట్ గా నిలిచింది… సో, కేం బ్యాక్ మంచి గా ఉంది! ఇక నెక్స్ట్ సినిమా కూడా మంచి రేంజ్ లో హిట్ అవ్వాలని, మంచి భక్తి, ఫామిలీ సినిమా కాన్సెప్ట్ ఎంచుకున్నాడు రవి తేజ. ఈరోజు తన పుట్టిన రోజు సందర్బంగా, టైటిల్ పోస్టర్ రివీల్ చేసారు…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ తొలి సినిమా ఇప్పటికే బలమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి విడుదల చేయడం ఫాన్స్ ని ట్రీట్ చేసింది!
ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. అయ్యప్ప స్వామి దీక్ష లోంచి ఎంతో పవిత్రంగా భావించే ఇరుముడి నుంచే ఈ పేరు తీసుకోవడం విశేషం. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే… రవితేజ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా అయ్యప్ప మాల లో కనిపించాడు – మొత్తం లుక్ ఒక ఆధ్యాత్మిక తేజస్సును ప్రతిబింబిస్తోంది.
రవితేజ చేతుల్లో ఒక చిన్నారి కనిపించడం ఎమోషన్ ని మరింత పెంచుతోంది. ఇది తండ్రి–కూతురు బంధం చుట్టూ తిరిగే కీలక కథాంశానికి సూచనగా కనిపిస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించిన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఫస్ట్ లుక్ ద్వారానే రవితేజ కెరీర్‌లో ఇది ఒక కొత్త ప్రయోగమని అర్థమవుతోంది. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఆధ్యాత్మికతతో కూడిన పాత్రలో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, కూతురు పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విష్ణు శర్మ నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా ని సమ్మర్ లో రిలీజ్ చేస్తారని టాక్…