రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.

Deputy CM Pawan Kalyan Visits Visakhapatnam Zoo, Adopts Giraffes & Inaugurates Eco Park

•తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటన

•జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

•జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు.

•జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు.

•ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు.

•కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *