రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా తీవ్రంగా నిరాశపరిచిన కారణంగా ఫాన్స్ చాల డీలా పడ్డారు. అయ్యో ఈ సినిమా ఏంటి ఇంత పని చేసింది, మా డార్లింగ్ ని ఒక లవర్ బాయ్ లా చూద్దాం అనుకున్నాం కదా అని అనుకున్నారు… సరేలే, అయ్యింది ఎదో అయ్యింది! ఇక నెక్స్ట్ ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఇంకా నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమాలు లైన్ లో ఉన్నాయ్…
ఇప్పటికే ఫౌజీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాల మటుకు కంప్లీట్ అయ్యింది అనే టాక్ వినిపిస్తుంది… కాబట్టి, ప్రభాస్ నెక్స్ట్ మంత్ లో స్పిరిట్ షూట్ స్టార్ చేస్తారంట… ఇక ఆ తర్వాత కల్కి 2 … ఇలా ఈ ఏడాది త్రి మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేస్తాడంట. ఇదిలా ఉంటె, ప్రభాస్ ఫౌజీ ఈ ఏడాది దసరా కి రిలీజ్ అంటున్నారు…
ఐతే రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను–రాఘవపూడితో చేస్తున్న చిత్రం ‘ఫౌజీ’. హై-ఆక్టేన్ యాక్షన్‌తో పాటు, ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్, టైటిల్ పోస్టర్లు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి.
ఇక ప్రస్తుతానికి చిత్ర నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకేసారి వేగంగా సాగుతున్నాయి. అన్నీ సమయానికి పూర్తి చేసి, దసరా పండుగ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. హాలిడేస్ సీజన్లో కాబట్టి దసరా, సంక్రాంతి తరువాత స్టార్ హీరో సినిమాలకు అత్యంత కీలకమైన రిలీజ్ పీరియడ్‌గా భావిస్తారు. ఈ టైమ్‌లైన్‌ను అందుకోవడం కోసం ప్రభాస్ భారీ డేట్స్ కేటాయించారని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్‌ను హను–రాఘవపూడి ఒక యోధుడిగా మలుస్తున్నారు. అర్జునుడి ఖచ్చితత్వం, కర్ణుడి వీరత్వం, ఏకలవ్యుడి అంకితభావం—అన్ని కలిసిన పాత్రగా ప్రభాస్ కనిపించనున్నారు. పోస్టర్‌లో కనిపించిన ఆయన రా అండ్ ఇంటెన్స్ లుక్, ఈ పాత్రలోని అపార శక్తిని స్పష్టంగా సూచించింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.