హోమ్‌గార్డ్‌ ఉద్యోగంతో 20 కోట్ల సంపాదన.. నోరెళ్లబెడుతున్న అధికారులు

Home Guard Amasses Rs 20 Crore Assets, ACB Raid Exposes Massive Corruption in Andhra Pradesh Police

ఉత్త‌రాంద్ర ప‌రువు తీసేస్తున్నారు పోలీస్ శాఖ లోప‌ని చేస్తున్న కొంద‌రు.మొన్న న‌కిలీ ఎస్పీ,నిన్న న‌కిలీ ఎస్ఐ,నేడు శాఖ‌లోనే ప‌ని చేసే ఓ కానిస్టేబుల్‌. పోలీస్ పేరు చెప్పుకుని ఇద్ద‌రైతే…వాళ్ల ప్రేర‌ణో,లేక వాళ్లే నాకు ఆద‌ర్శం.కాదు..కాదు..అవ‌కాశం చూసుకుని మ‌రీ అన్నం పెట్టే శాఖ‌కే శ‌ఠ‌గోపం పెట్టాడు. నీడ‌నిచ్చిన చెట్టునే నరికేందుకు ప‌న్నాగాలు ప‌న్నాడు.చివ‌ర‌కు ఏసీబీ కే గురువారం అడ్డంగా బుక్కయ్యాడు.వివ‌రాల్లోకి వెళితే..విజ‌య‌న‌గ‌రం ఏసీబీ శాఖ‌లో అదీ హోం గార్డ్ ఎటాచ్ మెంట్ తో ప‌ని చేస్తున్న నెట్టి శ్రీనివాస‌రావు ను గురువారం వ‌ల ప‌న్నీ మ‌రి ఏసీబీ డీఎస్పీ ర‌మ త‌న సిబ్బంది తో విజ‌య‌న‌గ‌రం గోక‌పేట‌లో ఉంటున్న ఆపార్ట‌మెంట్ లో రైడ్ చేసారు.

ఒక‌టి కాదు రెండు కాదు పదులు కాదు ఏకంగా 20 కోట్ల అక్ర‌మ ఆస్తులున్న‌ట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.పక్కా ఆధారాలు,ప్ర‌ణాళిక‌తో నెట్టి శ్రీనివాస‌రావు ఉంటున్న విజ‌య‌న‌గ‌రం,గుర్ల‌ల‌లో ప‌ది మంది ఏసీబీ బృందం సోదాలు చేసింది. ప‌దిహేనేళ్ల క్రితం ఏసీబీలో హొంగార్డ్ గా చేరిన నెట్టి శ్రీనివాస‌రావు…ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నార‌న్న విష‌యాన్ని ముందుగానే రైడ్ చేయ‌బోయే వాళ్ల‌కు ఉప్పు అందించేవాడు. ఇలా వాళ్ల‌ను సేఫ్ జోన్ లోకి పెట్టి, అవ‌త‌ల పార్టీ నుంచీ వేల‌లో డబ్బును ల‌బ్దిగా పొందినట్టు ఏసీబీ గుర్తించింది.ఇండ్ల రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల‌కు సంబంధించి రిజిస్ట్రేష‌న్ శాఖ సిబ్బదితో లోపాయికారిగా టై అప్ కొన‌సాగించేవాడు.

ఏసీబీ అధికారులు దాడులు చేస్తార‌ని ముందుగానే స‌మాచారం ఇచ్చి…లక్ష‌ల‌లో సొమ్మును లబ్దిగా పొందిన‌ట్టు ఏసీబీ చేసిన సోదాలు తేలింది. అయితే ఏడాదిన్న‌ర క్రిత‌మే శ్రీన‌వాస రావు య‌వ్వారం తెలియ‌డంతో శాఖ ప‌రువు పొకుండా ఎస్పీ ఆఫీస్ కు బ‌దిలీ చేసింది. ఏడాది నుంచీ జిల్లా పోలీస్ కార్యాల‌యంలోనే హోంగార్డ్ పీసీగా బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.దీంతో ఇక శ్రీనివాస‌రావు అవినీతి చిట్టాను ఏసీబీ విశాఖ ఏసీబీ డీఎస్పీ ర‌మ్య దాడులు చేసి మ‌రీ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.విజ‌య‌న‌గ‌రం గోక‌పేట‌లో శ్రీనివాస‌రావు ఉంటున్న ల‌క్ష్మీ నివాస్ అపార్ట‌మెంట్ లోనూ అటు గుర్ల మండ‌లంలోని న‌డికుదురులోనూ ఏసీబీ విస్త్ర‌త సోదాలు చేసింది. ప‌లు విలువైన డాక్యుమెంట్లు,రిజిస్ట్రేష‌న్ ప‌త్రాల‌ను స్థ‌లాల తాలూక డీ ప‌ట్టాల‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *