విజయనగరం జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది.జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఏ.డి గోవిందరాజులు అక్రిడేషన్లు కోసం వచ్చిన దరఖాస్తులు, విధివిధానాలు వెల్లడించారు. పెద్ద దినపత్రికల నుంచి 211 దరఖాస్తులు అందగా వీటిలో 203 దరఖాస్తులను ఆమోదించారు.చిన్న, మధ్య తరహా పత్రికల నుంచి 51 దరఖాస్తులు రాగా వీటిలో 32 దరఖాస్తులను ఆమోదించారు.

వార,మాస పత్రికల నుంచి 17 దరఖాస్తులు రాగా వీటిలో 15 ఆమోదించారు.వివిధ న్యూస్ ఛానెల్స్ నుంచి 130 దరఖాస్తులు రాగా వీటినుంచి 119 ఆమోదించారు. స్థానిక కేబుల్ నెట్ వర్క్ నుంచి 24 దరఖాస్తులు రాగా వీటిలో 22 పరిష్కారించారు. ఫైబర్ నెట్వర్క్ నుండి ఆరు దరఖాస్తులు రాగా వీటిలో రెండు ఆమోదించారు.ఆల్ ఇండియా రేడియో కు ఒకటి కేటాయించారు.సమాచార పౌరసంబంధాల శాఖకు చెందిన 11 మంది సిబ్బంది కి అక్రిడేషన్లు జారీ చేయడానికి అంగీకరించారు.
మొత్తం మీద అక్రిడేషన్లు కోసం 438 మంది జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 396 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందెందుకు అర్హులుగా గుర్తించారు.మిగిలిన 42 దరఖాస్తులు పక్క జిల్లాల వారివి కావటం,డబుల్ ఎంట్రీలుపడటం, కొంతమంది పేపర్లు సబ్మిట్ చేయకపోవడం వంటి కారణాల రీత్యా రిజెక్ట్ చేశారు.అలాగే పది మంది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ల దరఖాస్తులను పెండింగ్ లో పెట్టారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అనుమతి తో రెండో విడత లో వీటిపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మహాపాత్రో వెంకటేశ్వర, శివ ప్రసాద్, రాధాకృష్ణ, అప్పారావు,బి.జి.ఆర్ పాత్రో, రమేష్ నాయుడు,బూరాడ శ్రీనివాస్,మజ్జి శివ,ఈనాడు శ్రీనివాస్, నాగేంద్ర ప్రసాద్ లతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ప్రశాంతమైన వాతావరణం లో ఈ సమావేశం జరిగింది.