అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం

Deputy CM Pawan Kalyan Extends Support to Two More Orphaned Children in Pithapuram

•మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు
•ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాల’ని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *