నాగబంధం టీజర్ ని లాంచ్ చేయనున్న మహేష్ బాబు…

Mahesh Babu to Unveil Nagabandham Teaser on Maha Shivaratri

ఈ మధ్య మన టాలీవుడ్ లో మైథలాజికల్ ఇంకా మిథికల్ సినిమాలు ఎక్కువ అయ్యాయి… మరి మన పురాణాల్లో అంత పవర్ ఉంది ఇంకా ఎన్నో తెలియని స్టోరీస్ ఉన్నాయ్! సో, మొదటి పోస్టర్ నుంచే attention ని గ్రాబ్ చేసిన సినిమా నాగబంధం… ఈ సినిమా ప్రోమో కూడా భలే ఇంటరెస్టింగ్ గా ఉంది.

అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నాగబంధం సినిమాలో వీరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవిలో పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే మహా శివరాత్రి అయిన ఫిబ్రవరి 15న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ ఉత్సాహాన్ని ఇంకా పెంచుతూ, ఈ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రారంభ అప్‌డేట్లు సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించగా, మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్ విడుదల కావడంతో మరింత భారీ బజ్ ఏర్పడనుంది. ఈ గ్రాండ్ రివీల్‌కు ఉదయం 11:11 గంటలను ముహూర్తంగా ఖరారు చేశారు.

కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1750ల భారతదేశంలో ఉన్న పలు విష్ణు ఆలయాల నేపథ్యంలో సాగుతూ, నాగబంధం సంప్రదాయం వెనుక ఉన్న ప్రాచీన రహస్యాలు మరియు ఆధ్యాత్మిక గాఢతను ఆవిష్కరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *