అనుకున్నట్టే జరిగింది… అసలు నాని తన పారడైస్ సినిమా తో మన రామ్ చరణ్ పెద్ది తో పోటీ పడాల్సింది… లాస్ట్ ఇయర్ ఏ ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి, అప్పటి నుంచి, ఏంటి పెద్ది ఇంకా పారడైస్ సినిమాలు ఒక రోజు గ్యాప్ తో థియేటర్స్ లోకి వస్తున్నాయా అని ఫాన్స్ ని కంగారు పెట్టారు… కానీ ఇటు పెద్ది కానీ అటు పారడైస్ కానీ అనుకున్న డేట్స్ అంటే మార్చ్ లో రిలీజ్ అవ్వట్లేదు!
కొన్ని రోజుల కిందటే రామ్ చరణ్ పెద్ది సినిమా ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. సో వెంటనే పెద్ది రిలీజ్ డేట్ ని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి తీసుకున్నారు. సో, పవన్ కళ్యాణ్ సినిమా 26th మార్చ్ కి రిలీజ్ అవ్వబోతుంది!
సో, మరి పారడైస్ పరిస్థితి ఏంటి అనుకునేలోపు, ఈరోజు ఆ సినిమా రిలీజ్ డేట్ ని ఏకంగా ఆగష్టు కి పోస్టుపోన్ చేసారు… ఈ సినిమా ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం అయ్యాక నెక్స్ట్ వీకెండ్ అంటే 21st ఆగష్టు కి రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ, తనకి కొంచం టైం కావాలని తొందర ఏమి లేదని చెప్పాడు… అలాగే సినిమా లో నాని పేరు ‘జడలు’ తో పోస్టర్ ఉండడం తో సూపర్ అనిపించింది! ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్… ఈయన శికంజ మాలిక్ గా కనిపిస్తారు…