కొన్ని రోజుల కిందట మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద ఒక బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా కొన్ని అనవసర స్టేట్మెంట్స్ పాస్ చేసి అభాసు పాలయ్యారు… అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ పాటించాలంటూ ఒక పెద్ద లిస్ట్ చదివారు… కానీ అది మీడియా లో వైరల్ అవ్వడం తో, అసలు అల్లు అర్జున్ ఎలా ఉంటాడో మాకు తెలీదా అని చాల మంది టాలీవుడ్ నటులు, ఇంకా సెలబ్రిటీస్ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా వచ్చారు… అందుకే ఫైనల్ గా ఆ బ్రాండ్ స్ట్రాటజర్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పింది… ఇంతకీ ఆమె స్టేట్మెంట్ లో ఏముందంటే:
‘‘గత కొన్ని రోజులుగా నా పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. ఆ పాడ్‌కాస్ట్‌లో నేను కొన్ని ప్రకటనలు చేశా. అల్లు అర్జున్ను కలిసినప్పుడు చేయాల్సినవి.. చేయకూడనివి అంటూ 42 నిబంధనలు ఉంటాయని అన్నాను. ఇలా ప్రకటించడం సరైనది కాదని మరోసారి స్పష్టం చేస్తున్నా. నిబంధనలకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరించని పత్రాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అల్లు అర్జున్ లేదా ఆయనకు సంబంధించి ‘42 నిబంధనల’ పత్రమేమీ లేదు. పాడ్‌కాస్ట్‌లో నా మాటలు అలా దొర్లిపోయాయి. అవి వాస్తవం కాదని గుర్తించాలి. ఇలా మాట్లాడటం వల్ల సదరు కథానాయకుడి గౌరవ, ప్రతిష్ఠకు భంగం వాటిల్లినట్లు తెలిసింది. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. నా వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా’’ అని కావేరి బరూవా ప్రకటించారు.
ఇంకా మాట్లాడుతూ… ‘‘నటీనటుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోవిధమైన వ్యక్తిత్వం ఉంటుంది. అల్లు అర్జున్‌తో మరో రకమైన అనుభవం నేను ఎదుర్కొన్నా. ఆయనతో ఒక యాడ్ షూట్ చేశాం. దక్షిణాది నటులను కలిసే విషయంలో ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ల పరివారం ఎక్కువ. అల్లు అర్జున్ను కలవడానికి ముందు ఏం చేయాలి? ఏం చేయకూడదు లాంటి 42 నిబంధనలు ఉంటాయి. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారు. హీరోకు షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దు. తగిన దూరం పాటించాలి. హీరో సెట్లో ఉండగా ఫోన్ వినియోగించకూడదు’’. అని చెప్పి వివాదానికి తెరదించారు…