పొన్నూరు మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి గుడి మహత్యం తెలిపిన ప్రముఖ ప్రొడ్యూసర్ SKN

Producer SKN Shares the Spiritual Significance of Ponnur Sri Anjaneya Swamy Temple

టాలీవుడ్ ప్రొడ్యూసర్ తన సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా చాల యాక్టీవ్ ఉంటారు… ఈరోజు అయన పొన్నూరు లోని మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి గుడి మహత్యం తెలిపి అక్కడి పిక్స్ కూడా షేర్ చేసారు ట్విట్టర్ లో…

“గుంటూరు సమీపంలోని పొన్నూరు లో 24 అడుగుల ఎత్తు ఐన ఏకశిలా విగ్రహము
మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చాల శుభ ప్రదం మనసు కి ప్రశాంతని కలుగ చేస్తుంది.
ఈ విగ్రహాన్ని తయారు చేయటానికి 10 ఏళ్ళు పట్టింది 1940 లో మొదలు పెట్టిన ఈ విగ్రహము గుడి కట్టే ద్రవ్యం లేక 1950 నుండి ఒక బల్ల మీద పెట్టి పూజలు చేసే వారు గుడి కట్టే నగదు సమకూరక 1969 లో గుడి లో ప్రతిష్ట చేసారు. చిన్నతనం నుండి ఈ గుడికి రావటం అలవాటు ఇటీవలే మళ్ళి శ్రీ రామ భక్త హనుమాన్ ని దర్శించుకోవటం జరిగింది
11 ప్రదక్షిణాలు చేసి ఒక కోరిక కోరుకుంటే హనుమాన్ ఆ కోరిక నెరేవేరుస్తారు అని భక్తుల నమ్మకం ఆ కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేయటం ఇక్కడ ఆనవాయితీ.

ఇక్కడే 29 అడుగుల ఎత్తైన శ్రీ విష్ణు మూర్తి వాహనం గరుత్మంతుడు మరో ప్రధాన ఆకర్షణ
5 1/2 ఎకరాల్లో 7 గుడుల సమాహారం (శివుడు వినాయకుడు వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ నవగ్రహాలు ) ఇంకా ఈ ప్రాంతానికే ఒక మణిహారం మీకు కుదిరినప్పుడు తప్పకుండ వెళ్ళండి” అని చెప్పారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *