కోలీవుడ్ పాపులర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ చాల సినిమాల్లో కనిపించి మెప్పించింది. లాస్ట్ ఇయర్ హిట్ అయినా హనుమాన్ సినిమా లో కూడా అక్క క్యారెక్టర్ ప్లే చేసి సూపర్ అనిపించింది. ఇక ఇప్పుడు ‘సరస్వతి’ సినిమా తో మన ముందుకు రాబోతోంది! ఈ సినిమా రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసారు…
ఈ సినిమా కి తానే డైరెక్టర్ కూడా… ఆమె తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘సరస్వతి’ మొత్తం ఒక తల్లి ఎమోషనల్ రైడ్… భావోద్వేగాలతో నిండిన ఈ కథలో థ్రిల్లింగ్ మలుపులు కూడా ఉంటాయని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను Nani విడుదల చేయడం సినిమాపై ఇంకా ఆసక్తి ని పెంచింది.
ట్రైలర్ స్టార్టింగ్ చాల ఎమోషనల్ గా ఉంటుంది. వరలక్ష్మి ఒక పోలీస్ స్టేషన్‌లో కూర్చొని తన కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తుంది. తాను ఉదయం తన కూతురిని స్కూల్ వద్ద దింపానని చెబుతుండగా, ఆ తర్వాత ఆమె కనిపించకపోవడం కథలో ఉత్కంఠను పెంచుతుంది. ఇదే సమయంలో మరో కుటుంబం కూడా తమ కూతురిని వెతుక్కుంటూ ఆందోళనలో ఉంటుంది. ఆ దంపతులుగా Priyamani ఇంకా Kishore కనిపిస్తారు. ఈ రెండు కథలు సమాంతరంగా సాగుతూ, సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలను పరిచయం చేస్తాయి.
పోలీస్ అధికారిగా Murali Sharma కనిపిస్తారు. న్యాయవాదుల పాత్రల్లో Prakash Raj ఇంకా Srikanth Iyengar కనిపించడం కథకు మరింత బలం ఇస్తుంది. వరలక్ష్మి, ప్రియమణి, కిషోర్ ముగ్గురూ సహాయం కోసం ఇల్లు ఇల్లు తిరుగుతూ, తల్లిదండ్రుల ఆవేదనను హృదయానికి హత్తుకునేలా చూపిస్తారు.
కథ క్రమంగా ఒక ఉత్కంఠభరితమైన లీగల్ బ్యాటిల్‌గా మారుతుంది. కోర్టు సన్నివేశాలు, విచారణలు, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులను ట్రైలర్ ని మళ్ళి మళ్ళి చూడాలి అనిపించేలా చేసాయి. చివరికి వరలక్ష్మి తుపాకీ కొనుగోలు చేసి, దాన్ని ఉపయోగించడం నేర్చుకుంటున్న సన్నివేశం ఆశ్చర్యపరుస్తుంది. “ప్రతి మహిళ సరస్వతి కాదు… అవసరం అయితే కాళిగా మారుతుంది” అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ మాట సినిమా యొక్క ప్రధాన భావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది — ఒక తల్లి తన పిల్లల కోసం ఏ స్థాయికైనా వెళ్లగలదని.
ఈ చిత్రాన్ని వరలక్ష్మి తన సోదరి పూజతో కలిసి ‘డోసా డైరీస్’ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని Thaman S అందించారు.