తలైవా రజినీకాంత్… ఒక వైపు…
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఒక వైపు…
ఇద్దరు సౌత్ ఇండియన్ సినిమా కి రెండు పిల్లర్స్…
ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం కలిసి నటించారు… కానీ మళ్ళి ఇప్పుడు కలిసి నటిస్తున్నారు… అది కూడా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో! ఇక ఈరోజు ఒక గ్లింప్సె కూడా రిలీజ్ చేసి, అంచనాలని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు!
దశాబ్దాలుగా తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్న వార్తే సినీ ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఇందాకే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అదే సందర్భంలో ఒక ప్రత్యేక గ్లింప్స్ వీడియోను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఈ గ్లింప్స్ వీడియోను రిట్రో స్టైల్‌లో అద్భుతంగా రూపొందించారు. పాతకాలపు సెటప్, లైటింగ్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించాయి. మొదట దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇంకా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ మధ్య సరదా సంభాషణతో వీడియో మొదలవుతుంది. ఇద్దరి మధ్య జరిగే ఆ చిన్న చమత్కార సంభాషణ ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు తెప్పిస్తుంది.
అంతలోనే స్టైలిష్ ఎంట్రీ ఇస్తూ సూపర్ స్టార్ Rajinikanth ఇంకా ఉలగనాయకుడు Kamal Haasan రిట్రో లుక్‌లో కనిపిస్తారు. వారు స్టైలిష్ డ్రెస్సుల్లో, స్వాగ్ తో ఒక గ్యారేజ్ లోపలికి అడుగుపెడుతూ కనిపించే సన్నివేశం అభిమానులకు పండుగలా అనిపిస్తుంది. ఆ స్వాగ్, ఆ ఆరా, ఆ అటిట్యూడ్ – ఇద్దరూ కలిసి నడుస్తుంటే తెరపై ఓ మేజిక్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. వీడియో చివర్లో “ఈ సినిమాలో హీరో ఎవరు?” అనే ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచి ప్రేక్షకుల్లో మరింత కుతూహలం రేకెత్తించారు.
ఈ భారీ చిత్రాన్ని Red Giant Movies నిర్మిస్తోంది. సంగీతాన్ని అనిరుధ్ అందించనున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చివరిసారిగా 1979లో వచ్చిన ఫ్యాంటసీ చిత్రం Allauddinum Albhutha Vilakkum లో కలిసి నటించారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు మహానటులు కలుసుకోవడం అభిమానులకు నిజంగా ఒక స్వప్నసాకారం లాంటిది.
ఇక ఈ గ్లింప్స్‌లో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే – రజనీకాంత్ ఈ వీడియోకు స్వయంగా వాయిస్ ఇవ్వడమే. సాధారణంగా ఇలాంటి అనౌన్స్‌మెంట్ వీడియోలకు కమల్ హాసన్ వాయిస్ ఇస్తుంటారు. కానీ ఈసారి రజనీ స్వరం వినిపించడం అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక పూర్తి సినిమాకూ రజనీ వాయిస్ అందిస్తారా లేదా అన్నది చూడాలి.
దర్శకుడు నెల్సన్ ఇప్పటికే రజనీకాంత్‌తో కలిసి Jailer అనే బ్లాక్‌బస్టర్ చిత్రం చేశారు. ప్రస్తుతం వారి రెండో కలయికగా Jailer 2 కూడా రూపొందుతోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ వారి మూడో కలయికగా నిలవనుంది. అయితే కమల్ హాసన్ తో మాత్రం నెల్సన్ మొదటిసారి పని చేస్తున్నారు.
మొత్తానికి, ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే తెరపై కనిపించబోతున్నారు అన్న వార్తే సినీ ప్రేమికులకు ఒక పెద్ద వేడుకలా మారింది. రిట్రో స్టైల్ గ్లింప్స్‌తో మొదలైన ఈ ప్రయాణం, రాబోయే రోజుల్లో ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ మెగా కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.