విజయ్ కి ఇంకో షాక్ ఇచ్చిన సంగీత…

Vijay Faces Fresh Trouble as Wife Sangeetha Files Petition Over Chennai Residence

తమిళ స్టార్ హీరో Vijay ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు… ఆయన ఇటీవల టీవీకే (TVK) అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు అన్న సంగతి కూడా తెలిసిందే. ఐతే సడన్ గా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.

విజయ్ భార్య Sangeetha Sornalingam కుటుంబ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చేసిన ఆరోపణలు పెద్ద చర్చకు దారి తీశాయి. విజయ్ ఒక నటి తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. అలాగే విజయ్ రెండేళ్లుగా ఇంటికి రావట్లేదని, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆరోపించింది!

Shameful: Vijay-Trisha Attend Wedding Reception Amid His Divorce  Proceedings With Estranged Wife Sangeetha, Fans Unhappy | Republic World

ఇదిలా ఉండగా, ఇటీవల చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో విజయ్, నటి Trisha Krishnan కలిసి కనిపించడం మరింత చర్చకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఇప్పుడు మరోసారి విజయ్ భార్య సంగీతో వార్తల్లోకి వచ్చారు. చెంగల్పట్టు కోర్టులో ఆమె కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ ఇంట్లోనే తాను ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.

విజయ్ లాయర్లు తనను ఆ ఇంట్లో ఉండనివ్వమని బెదిరిస్తున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. విడాకులు పూర్తయ్యే వరకు తాను అదే ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.

సంగీత బ్రిటిష్ పౌరురాలు. చెన్నైలో తనకు మరో ఇల్లు లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో విజయ్ కుటుంబ విషయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి.

ఇదిలా ఉండగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం Jana Nayagan విడుదల కూడా ఆలస్యం అవుతోంది. సెన్సార్ సమస్యల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఇటీవల విజయ్ కుమారుడు Jason Vijay సోషల్ మీడియాలో తన తండ్రిని అన్‌ఫాలో చేయడం కూడా తమిళనాడులో పెద్ద సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *