16/06/2026
Pregnant Woman Seeks Protection At District Police Office After Harassment Complaint

Pregnant Woman Seeks Protection At District Police Office After Harassment Complaint

  • జిల్లా పోలీస్ ఆఫీస్ సాక్షిగా గ‌ర్భిణి క‌న్నీళ్లు
  • అర్ధ‌రాత్రి అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌కు ఆగ‌ని దు:ఖం
  • స్థానిక పీఎస్ లో న్యాయం జ‌ర‌గ‌లేదని ఆరోప‌ణ‌
  • నాకు రక్షణ కల్పించండంటూ గర్భిణి డిమాండ్

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఉగ్రం సినిమాలో ఎస్ఐ ఇంటికే వ‌చ్చి భార్య ముందే అర్డ‌న‌గ్నంగా గంజాయి సేవించిన కుర్రాడు ప్ర‌వ‌ర్తించినట్టుగ అచ్చం అలాంటి ఘ‌ట‌నే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ నెల 11వ తేదీన జ‌రిగింది. క్లోజడ్ స‌ర్క్యూట్ కెమారాల ద్వారా జ‌రిగిన దారుణం రికార్డ్ అయిన, స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేక‌పోవ‌డంతో స్థానిక జిల్లా పోలీస్ కార్యాల‌యంలో జ‌రుగుతున్న‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వేదిక‌కు నిండు గ‌ర్భిణి వ‌చ్చి సోమ‌వారం ఫిర్యాదు చేసింది. మృగాళ్ల నుంచీ న‌న్ను,నా కుటుంబాన్ని ర‌క్షించ‌డంటూ మొర పెట్టుకుంది.

వివ‌రాల్లోకి వెళితే చింత‌ల‌వ‌ల‌స ఐద‌వ బెటాలియ‌న్ వ‌ద్ద కృష్ణాపురం వ‌ద్ద అనూరాద త‌న కుటుంబంతో ఉంటోంది. కూతురు, అత్త‌,మ‌రిది క‌లిసే ఉంటున్నారు. స్వంత ఇంట్లోనే ఉంటున్న‌ క‌ల్యాణ్ దంప‌తుల ఇంటి ఎదురుగానే పృధ్వీ అనే వ్య‌క్తి కూడా ఉంటున్నారు.ఇంట్లో ఉన్న మామిడి చెట్టు నుంచీ కాయ‌లు ఎదురింట్లో ప‌డిపోవడంతో అవి తీసుకునేందుకు గ‌ర్భిణి అనునాధ వెళ్లింది. అప్ప‌టి నుంచీ పృద్వీ గొడ‌వ మొద‌లైంది. అనుమ‌తి లేకుండానా ఇంట్లోకి వ‌స్తారా అంటూ చింతులేసాడు. గ‌ర్భిణి వివ‌ర‌ణ ఇచ్చినా అక్క‌డితో ఆగిన ఆ త‌ర్వాత క‌ల్యాణ్ ఇంట్లోంచి ఆడ‌వాళ్లు ఎవ్వ‌రు బ‌య‌ట‌కు వ‌చ్చినా ఏడిపించే వాడు.

పెద్ద కూతురితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు. అక్క‌డితో ఆగ‌ని పృధ్వీ, గ‌ర్బిణి అయిన అనునాద‌ ఇంటి ముందుకొచ్చి ఉగ్రం సినిమాలో ఎలా ప్ర‌వ‌ర్తించాడో అదే విధంగా చేసేవాడు.ఆ ప‌నేంట‌ని అనునాధ అత్త‌ అడిగేస‌రికి ఆమె పై ఏకంగా భౌతికంగా దాడికి దిగాడు. ఇక లాభం లేద‌న‌కుని గ‌ర్బిణి అనూరాధ త‌న భర్త‌తో క‌లిసి స్థానిక పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పృధ్వీ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌,భౌతిక దాడి ఘ‌టన‌ల‌ను సాక్షాల‌తో ఫిర్యాదు చేసింది. రోజులు గ‌డుస్తున్న పోలీసులు ప‌ట్టించుకోక‌వ‌డంతో నేరుగా జిల్లా పోలీస్ కార్యాల‌యంకు ఆరు నెల‌ల గర్భిణితో అనురాధ త‌న కుటుంబంతో వ‌చ్చి ఫిర్యాదు చేసింది. సొంతింట్లో ఉంటున్న మాకు ర‌క్ష‌ణ కావాల‌ని ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కు వ‌చ్చి ఫిర్యాదు చేసింది.

Also Read  బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన: చంద్రబాబుతో ఆర్టీజీఎస్ సందర్శన, వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీ పరిశీలన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *