భార్య ని గుర్తు చేసుకున్న ఉత్తేజ్…

Uttej’s Emotional Post Remembering His Late Wife Moves Fans

ఉత్తేజ్… అసలు ఈ నటుడు కి పరిచయం అవసరమా… మన అందరికి తెలిసిన వ్యక్తి… మంచి ఆర్టిస్ట్… తెర పై నవ్వులు పూయించగలడు అలానే ఏడిపించగలడు కూడా… సినిమాలనే కాదు బయట కూడా చాల యాక్టీవ్ గా వుండే ఉత్తేజ్ ఈరోజు సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ తో అభిమానులని ఏడిపించేసాడు… ఈరోజు పెళ్లి రోజు కావడం తో తన భార్య ని గుర్తు చేసుకుని ఒక మంచి పోస్ట్ చేసాడు…

“పద్దూ….
🌹🌹
ఈరోజు మన పెళ్లిరోజు.
ఇపుడు బాగా గుర్తుంటోంది. ..
అప్పుడు, నీ పుట్టినరోజుని,మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుండే గుర్తుపెట్టుకొని.. date వల్లె వేస్తూ ఉండేవాణ్ణి….ఎక్కడ మర్చిపోతానో అని….
ఇది అందరి మొగుళ్లకి
అనుభవైకవేద్యమే…….
ఎలా ఉన్నావు పద్దూ…
కడదాకా, నే కడతెరే దాకా
నా వెంటే ఉంటానన్నావు.
మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్…పట్టు సడలి
కిందపడ్డాను…లేచి చూస్తే నువ్వు లేవు..పిలిచా..అరిచా..
ఏడ్చా.నువ్వులేవు..ఇంకా వెదుకుతూనే వున్నా..
సంతలో తప్పిపోయిన
పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు….
తప్పు చేసావు పద్దూ..
నన్ను మరీ dependent చేసావ్.. అన్నిటికీ తోడున్నావ్..అన్నింటికీ
ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు.నేనున్నాగా పర్లేదన్నావ్..ధైర్యం అయ్యావు..ఆలంబన అయ్యావు..ఆసరా అయ్యావు…ముందుంటావనుకున్నా..ముందుగా వెళ్తావనుకోలేదు…
అన్ని పనులు…
భోజనం…
ఆలనా పాలనా
ఓ magic లా సాక్షాత్కారమయ్యేవి….
తిట్టుకున్నా..అరుచుకున్న
నవ్వుతా..తుళ్ళుతా
ఉండేదానివి…….
నాన్న లా భుజం తట్టావు..
తిట్టావు కూడా..
అమ్మలా అక్కున చేర్చుకున్నావు..
ఫ్రెండ్ లా తోడున్నావు..

పాటమ్మ..కి నిన్ను తెచ్చివ్వలేను కానీ…
ఆ స్పర్శ ని అందివ్వలేను కానీ….నీ బాధ్యతని..నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్న….
నాన్న లా 100% ఉంటాను..
దానికి నేనయినా ఉన్నాను…
నాకే…………..లేరు..
Love you.. పద్దూ.
WE
MISSING YOU………”

నిజంగా ఈ పోస్ట్ చుస్తే గుండె పిండేసినట్టు ఉంది కదండీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *