రథయాత్రలో అద్భుతం… అంబులెన్స్‌కు దారి ఎలా ఇచ్చారో తెలుసా?

Divine Miracle During Rath Yatra

పూరీ జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది. పూరీ రథయాత్ర అంటే లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఉత్సవం. ఈ ఉత్సవంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి బయటపడటం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. రథోత్సవం జరిగే ప్రాంతంలో అత్యవసరం కోసం వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రథయాత్ర జరుగుతుండగా అంబులెన్స్‌లో అత్యవసరంగా రోగిని తరలించాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్‌ దారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ, బీజేపీ యువమోర్చాకు చెందిన సుమారు 1500 మంది కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి లక్షలాదిమంది క్రౌడ్‌ను కంట్రోల్‌ చేస్తూ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూరీ జగన్నాథ్‌ రథయాత్రను నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దానిపై పలు విమర్శలు వస్తాయి. పైగా హిందూత్వకార్డుతో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీనే పూరీ జగన్నాథ్‌ రతయాత్రను విజయవంతంగా నిర్వహించలేకుంటే అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. అందుకే ప్రభుత్వం ముందునుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *