వెస్టర్న్ ఆర్గస్ మానిటర్, లేదా యెల్లో-స్పాటెడ్ మానిటర్ (Varanus panoptes), ఆస్ట్రేలియా ఉత్తర భాగంలో మరియు దక్షిణ న్యూగినియాలో కనిపించే ఒక పెద్ద, శక్తివంతమైన మానిటర్ లిజర్డ్. దీని శరీరంపై పసుపు రంగు చుక్కలు ఉండటం వల్ల దీనిని “యెల్లో-స్పాటెడ్” అని కూడా పిలుస్తారు. ఈ చుక్కలు గ్రీకు పురాణంలోని ఆర్గస్ పానాప్టెస్ అనే వంద కళ్లతో కూడిన రాక్షసుడిని పోలి ఉంటాయి, అందుకే దీనికి “ఆర్గస్” అనే పేరు వచ్చింది.
ఇవి సాధారణంగా ఐదు అడుగుల ఎత్తు వరకు పెరుగుతంటాయి. వాటి చేష్టలు చూసేందుకు భయానకంగా, భయపెట్టే విధంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న క్షీరదాలు, పక్షులతో పాటు రెప్టైల్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఎవరైనా తనకంటే బలవంతుడు లేదా తనకు ఆపద సంభవించబోతున్నది అనుకున్న సమయంలో వెనక రెండు కాళ్లపై నిలబడి ముందు రెండు కాళ్లను ముందుకు జాపి పెద్దదైన తన నోరును తెరచి నాలుకను బలంగా బయటకు విసురుతుంది. ఆ సమయంలో అది చూసేందుకు చిన్నసైజులో ఉండే డైనోసార్లా కనిపిస్తుంది.
జంతు ప్రేమికులు, సాహసగాళ్లు ఎక్కువగా ఆస్ట్రేలియా ఉత్తర భాగాన్ని, దక్షిణ న్యూనియాను సందర్శించి వీటి జీవితాన్ని పరిశీలిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఈ వెస్టర్న్ ఆర్గస్ మానిటర్ వద్దకు వెళ్లగానే అది తన రెండు కాళ్లపై నిలబడి నోరును పెద్దగా తెరిచి భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇది చిన్న వీడియోనే కాకపోతే సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయింది. మనిషిని భయపట్టే జంతువులు ఇంకా అనేకం ఉన్నాయని చెప్పడానికి, వీటి సంఖ్య పెరిగితే మనిషి మనుగడకు విఘాతం కలుగుతుందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.