సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆయా ఆలయాల ఆగమ నియమాలను అనుసరించి ఆలయాలను మూసివేయనున్నారు. కొన్ని ఆలయాలను అదేరోజు సాయంత్రం తరువాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి తెరిచే అవకాశం ఉండగా, మరికొన్ని ఆలయాలను ఉదాహరణకు విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 8.30 గంటలకు తిరిగి తెరుస్తారు. కారణం చంద్రగ్రహణం. ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో గ్రహకాల నియమాలను అనుసరించి ఆలయాలను మూసివేస్తారు.
అయితే, గ్రహణం సమయంలో తెరిచి ఉండే ఏకైక ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఇక్కడ రాహుకేతు పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి. గ్రహ దోషాల నుంచి విముక్తి కోసం నిత్యం భక్తులు కాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తారు. గ్రహణ సమయాల్లో నిర్వహించే పూజల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. రాహుకేతు గ్రహాల పూజలకు శ్రీకాళహస్తి దేవాలయం ఎందుకు ఫేమస్ అయిందో మరో ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7న ఈ ఆలయం తప్పా అన్నీ మూసివేత…కారణం ఇదే

Spread the love