ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్య్జూజే) విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాలుష్యరహిత మట్టి గణపయ్య విగ్రహాలను జిల్లాకలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్ జిల్లా కలెక్టరేట్ క్యాంటీన్ వద్ద మంగళవారం పంపిణీ చేసారు.ఈ మేరకు యూనియన్ నేతలు ,అక్షరాలు రాయడంలో కాకలు తీరిన యోధాను యోధుల,పత్రికా రంగంలో పండిన అనువజ్ఙులైన రాష్ట్ర, జిల్లా స్థాయి రిపోర్టర్ల సమక్షంలో అదీ ఏపీయూడబ్య్జూజే పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబే్దర్కన్ స్వహస్తాల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసారు.
ఈ సందర్బంగా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్ మాట్లాడుతూ వినాయక చవితిని కాలుష్యం వెదజల్లకుండా ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలనే పంపిణీ చేస్తోంద్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా మట్టివిగ్రహాలనే పంపిణీ చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతల శివ, ,సరేష సురేష్, అప్పారావు,మహాపాత్రో,జిల్లా నేతలు రాజు,రవికుమార్, శర్మ,నరసింగరావు,,పంతులు,వేదుల సత్యనారాయణ ,రాజు పట్నాయిక్,మణికంఠ,క్యాంటిన్ అధినేత రమణ,ట్రెజరీ ఉద్యోగి పద్మనాభం, ఐ అండ్ పీ ఆర్ ఉద్యోగులు జానకి,మురళీ తదితరులు పాల్గొన్నారు