ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రె ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్నారు. పైడితల్లి అమ్మవారి పండగ తేదీలు ప్రకటించిన మేరకు మంత్రి కొండపల్లి విజయనగరం మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో కొలువతీరే అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ ద్వారం వద్ద విలేకరులతో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అక్టోబర్ లో పండగ అయిన వెంటనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లను పలిచామన్నారు. ఇక ఉత్తరాంద్ర కల్పవల్లి శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తరాంద్రకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలనుంచీ అలాగే పొరుగు రాష్ట్రం ఓడిషా నుంచీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోప తండాలు గా వస్తారన్నారు. పండగకు దేవాదాయ శాఖ కు ఇప్పటికే నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి కొండపల్లి స్పష్టం చేసారు.
పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులపై మంత్రి కొండపల్లి వ్యాఖ్యలు

Spread the love