పోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ పై భక్తిభావం కనుచూపు మేరైనా ఉండదు ఆపై కనిపించలేదు. అలాలేకపోతే వాళ్లెవ్వరూ పోలీస్ అనిపించుకోరు, ఖాకీ అనలేము. కానీ విజయనగరం ఒక దగ్గర ఇలా కింద కూర్చుని వినాయక పూజ చేస్తున్న వాళ్లంతా ఖాకీలే…!అదేనండీ ఖాకి యూనిఫామ్ వేస్తున్న పోలీసులే. ఆ మధ్య ఒకసారి ఆడవిడుపుగా యూనీఫాం తీసేసి, ఒక వైపు కాల్ గర్ల్స్, మరోవైపు క్రీడాకారుల అవతారం ఎత్తి విజ్జి స్టేడియం లో క్రికెట్ ఆడారు. తాజాగా అదీ బొజ్జ గణపయ్య పండగను ఇలా జరుపుకున్నారు వీళ్లంతా. ఇంతకీ వీళ్లెవ్వరో మీకు చెప్పలేదు కదూ…! విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు స్టేషన్ ఎస్ఐలు కృష్ణమూర్తి, కనకరాజు, ఏఎస్ఐ రామారావు, సిబ్బంది కాశీ తదితరులు. కాసేపు యూనీఫాం అంటే చేతిలో లాఠీ, నడుము కి వెపన్, అలాగే మైండ్ కు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు పక్కన పెట్టి, అటు క్రీడలలోనూ, ఇటు ఆధ్యాత్మిక భావనలో ఉండి కాస్సేపు మనశ్శాంతి పొందారు.
మారుతున్న “ఖాకీ”ల స్వభావం

Spread the love