మగతనానికి అడ్డంకిగా మారుతున్న ఆహారం

Diet Habits Lowering Testosterone in Men
Spread the love

ఆల్కాహాల్‌ ఆరోగ్యానికి హానికరం. ప్రతిరోజూ ఆల్కాహాల్‌ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే మందును మితిమీరి తీసుకుంటే ప్రాణాలు పోవడం ఎలా ఉన్నా కొద్దిరోజుల్లోనే మగతనం దెబ్బతింటుంది. రోజూ ఆల్కాహాల్‌ తీసుకుంటే అది అరోమాటేస్‌ అనే ఎంజైమ్‌ను శరీరంలో పెంచుతుంది. ఈ ఎంజైమ్‌ మగతనానికి చిహ్నంగా ఉండే టెస్టోస్టెరాన్‌ను ఈస్ట్రోజన్‌గా మారుస్తుంది. బీర్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే ఫైటో ఈస్ట్రోజన్‌ ఎక్కవగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా టెస్టోస్టెరోన్ స్థాయి 23 శాతం వరకు తగ్గిపోతుంది. దీర్ఘకాలంగా బీర్‌ తాగే అలవాటు ఉంటే వారిలో హైపోగోనాడిజం అనే సమస్య ఉత్పన్నమౌతుంది. అల్ట్రా ప్రాసెడ్‌ ఫుడ్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన కూడా టెస్టోస్టెరాన్‌ స్థాయి తగ్గిపోతుంది. శరీరంలో వాపు వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే ప్రాసెడ్‌ ఫుడ్‌ను తీసుకోవడం నిలిపివేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడానికి కూడా ఈ ప్రాసెడ్‌ ఫుడ్‌ కారణం అవుతుంది. ఆరోగ్యానికి ఉపయోగపడే సోయా గింజలను కూడా ఎక్కువగా తీసుకోరాదు. సోయాలో ఉండే ఐసోప్లేవోన్స్‌ శరీరంలో ఈస్ట్రోజన్‌పై ప్రభావం చూపుతుంది. ప్రీ టెస్టోస్టెరాన్‌ స్థాయిని తగ్గించి ఈస్ట్రోజన్‌ శాతాన్ని క్రమంగా పెంచుతుంది. కూరల్లో రుచిగా ఉందని, నాన్‌వెజ్‌లోనూ బాగుంటుందని, పచ్చడి చేసుకుంటే అబ్బా అని లొట్టలేసుకొని తినే ఆకు పుదీనా. పుదీనా ఎంత రుచిగా ఉంటుందో అంత ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుంది. పుదీనాను కూడా వీలైనంత వరకు మితంగానే తీసుకోవాలి. దీర్ఘకాలికంగా నిత్యం ఎక్కువ మొత్తంలో పుదీనా తీసుకుంటే శరీరంలో టెస్టోస్టెరాన్‌ శాతం తగ్గిపోతుంది.

ఇప్పుడు చెప్పబోతున్న విషయం మనలో చాలా మందికి రుచించకపోవచ్చు. నోటికి రుచిగా ఉంటాయి ప్రైడ్‌ ఫుడ్స్‌, మార్జరిన్, పేస్ట్రీలు వంటి వాటిని ఇష్టంగా తినేస్తుంటాం. వీటిని కూడా వీలైనంత వరకు తగ్గించేయాలి. లేదంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ ఫాస్ట్‌ ఫుడ్ లో ఉండే ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ వృషణాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. శుక్రకణాల నాణ్యత తగ్గిపోతుంది. అంతేకాదు, శుక్రకణాల ఉత్పత్తి జరిగే లెయిడిగ్ కణాల్లో వీటి ఉత్పత్తి మందగిస్తుంది. చివరకు వంధత్వం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి పిల్లలు కలగక పోవడానికి కారణం కూడా ఇదే. ఆరోగ్యం కోసం మనలో చాలా మంది ఫ్లాక్స్‌ సీడ్స్‌ తీసుకుంటూ ఉంటాయి. ఇందులో లిగ్నాన్స్‌ అధికంగా ఉంటాయి. ఈ లిగ్నాన్స్‌ టెస్టోస్టెరాన్‌ను శరీరం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. ఫలితంగా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఆరోగ్యం కోసం కావాలంటే వారానికి ఒకటి రెండుసార్లు ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకుంటే మంచిది. అలా కాకుండా ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు స్పూన్ల ఫ్లాక్‌ సీడ్స్‌ తీసుకుంటే ఫ్రీ టెస్టోస్టెరాన్‌ స్థాయి తగ్గిపోతుంది.

ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఫ్యాట్‌, తక్కువ కొలెస్ట్రాల్‌ ఉండే ఫుడ్స్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే టెస్టోస్టెరాన్‌ అనేది కొవ్వు నుంచే తయారవుతుంది. సరైన మోతాదులో కొవ్వు తీసుకోకుంటే టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి 1- నుంచి 20 శాతం వరకు తగ్గిపోతుంది. ఈ సృష్టి మందగించకుండా ముందుకు సాగాలన్నా, మనం మన దేశాలు అభివృద్ధి సాధించాలన్నా… జనాభా ఎంతో అవసరం. జనాభా పెరుగుదల ఎన్నటికీ అనర్థం కాదు. కానీ, జనాభా పెరుగుదలను మన ఆహారపు అలవాట్లు చంపేస్తే దానికన్నా అవమానం మరొకటి ఉండదు. ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *