ఓ పెద్ద టిప్పర్ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఓ మాస్ పవర్ హీరో. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న తాను ఒప్పుకున్న వాటిని పూర్తి చేసేందుకు, అభిమానులను అలరించేందుకు సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. రెట్రో గ్యాంగ్స్టర్ కథతో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫొటోస్ అన్నీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కత్తిపట్టిన తీరు ఆయన అభిమానులను పిచ్చెక్కించేలా చేసింది. దాని ఫలితమే ప్రీ సేల్ రికార్డులు. ఇప్పటికే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో 9 లక్షల డాలర్ల టికెట్ సేల్ జరిగింది. పవర్ స్టార్ పుట్టిన రోజునాడు భారీ ఎత్తున ప్రీ సేల్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికాతో పాటు ఇప్పుడు యూకేలోనూ అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ ఏ స్థాయిలో బుకింగ్స్ నమోదవుతాయో చూడాలి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Related Posts
దీపావళి రోజున లక్ష్మీపూజ ఎందుకు చేయాలి?
దీపావళి అంటే వెలుగుల పండుగ అని మనందరికీ తెలుసు. కానీ ఈ వెలుగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎవరో తెలుసా? ఆమె మహాలక్ష్మీదేవి. దీపావళి రోజున…
దీపావళి అంటే వెలుగుల పండుగ అని మనందరికీ తెలుసు. కానీ ఈ వెలుగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎవరో తెలుసా? ఆమె మహాలక్ష్మీదేవి. దీపావళి రోజున…
విజయనగరం టూటౌన్ పీఎస్లో సంక్రాంతి ఉత్సవాలు…పంచెకట్టులో సిబ్బంది
విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సంక్రాంతి సంబరాలను ఎస్పీ దామోదర్ సోమవారం ప్రారంభించారు. ఖాకీ రంగు దుస్తులతో యూనీఫాంలో ఉండే స్టేషన్ సిబ్బంది యావత్తూ స్టేషన్…
విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సంక్రాంతి సంబరాలను ఎస్పీ దామోదర్ సోమవారం ప్రారంభించారు. ఖాకీ రంగు దుస్తులతో యూనీఫాంలో ఉండే స్టేషన్ సిబ్బంది యావత్తూ స్టేషన్…
Trigun’s ‘Mr. Work From Home’
Post Views: 34
Post Views: 34