ఓ పెద్ద టిప్పర్ లారీ వచ్చి కారును గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ సముద్రంలో కాదు…భూమిపై వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నా పవర్ స్టార్ అభిమానులు. పవన్ కళ్యాణ్ ఓ మాస్ పవర్ హీరో. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న తాను ఒప్పుకున్న వాటిని పూర్తి చేసేందుకు, అభిమానులను అలరించేందుకు సమయం దొరికినప్పుడు సినిమాలు చేస్తున్నారు. రెట్రో గ్యాంగ్స్టర్ కథతో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫొటోస్ అన్నీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పవన్ కత్తిపట్టిన తీరు ఆయన అభిమానులను పిచ్చెక్కించేలా చేసింది. దాని ఫలితమే ప్రీ సేల్ రికార్డులు. ఇప్పటికే నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో 9 లక్షల డాలర్ల టికెట్ సేల్ జరిగింది. పవర్ స్టార్ పుట్టిన రోజునాడు భారీ ఎత్తున ప్రీ సేల్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికాతో పాటు ఇప్పుడు యూకేలోనూ అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ ఏ స్థాయిలో బుకింగ్స్ నమోదవుతాయో చూడాలి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Related Posts
రెండు వందల కోట్లు దాటిన ప్రభాస్ రాజా సాబ్ కలెక్షన్స్…
ప్రభాస్ రాజా సాబ్… మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అసలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ తీరా ఫస్ట్…
ప్రభాస్ రాజా సాబ్… మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అసలు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ తీరా ఫస్ట్…
Hyderabad సెంట్రల్ యూనివర్శిటీలో ఏబీవీపి ఘనవిజయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఏబీవీపీ ఆధిపత్యం కొనసాగించడం విశేషం.…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఏబీవీపీ ఆధిపత్యం కొనసాగించడం విశేషం.…