ఈరోజు రాత్రి 9:52 నుంచి అర్ధరాత్రి దాటే వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉన్నాయి. ఈ చంద్రగ్రహణం కారణంగా ఇప్పటికే దేశంలోని పలు ఆలయాలను మూసివేశారు.
అయితే, మధ్యాహ్నం 12.58 నుంచి సూతకకాలం ప్రారంభం అవుతుంది. దీంతో ఆలయాల్లో గ్రహణ దోషాలకు సంబంధించి పూజలు నిర్వహించి, ఆలయాలను మూసివేశారు. వరంగల్ లోని ఖాజీపేట శ్వేతర్క మూల గణపతి ఆలయాన్ని మూసేశారు. మరలా రేపు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు.