మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతారల జోడీపై ఒక అద్భుతమైన నైట్ ఎఫెక్ట్ మెలడీ పాటను ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు. ఇది చిరంజీవి – కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి మాస్టర్‌ల ఫస్ట్ కోలాబరేషన్. పుష్పా 2 లోని “పుష్పా పుష్పా” సాంగ్, మిరాయి లోని “వైబ్ ఉంది లే” లాంటి హిట్ నంబర్లను రూపొందించిన ఈ మాస్టర్, ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైటింగ్‌గా మారింది.
ఈ షెడ్యూల్‌లో ఇంకో పాటతో పాటు, ఆ రెండు పాటలకు లీడ్ అయ్యే కీలక సన్నివేశాలు కూడా షూట్ చేస్తున్నారు. ఇక అక్టోబర్‌లో ప్లాన్ చేసిన మెజర్ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ కూడా జాయిన్ కానున్నారు. ఆ షెడ్యూల్‌తో సినిమాకి 99% షూట్ పూర్తవుతుందని టీమ్ చెప్పింది.
ఇకపోతే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూట్‌తో సమాంతరంగా జరుగుతున్నాయి. అంటే రిలీజ్ కోసం అన్ని పనులు ఫాస్ట్ ట్రాక్‌లోనే సాగుతున్నాయన్న మాట.
MSG అంటే మన శంకర వర ప్రసాద్ గారు… ఈ సినిమా సంక్రాంతి 2026కు రెడీ అవుతోంది. సంక్రాంతి బ్లాక్‌బస్టర్లకు హాట్ ఫేవరెట్‌గా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, చిరంజీవి – వెంకటేష్‌ల అద్భుతమైన కామెడీ టైమింగ్‌ని మేజర్ హైలైట్‌గా చూపించబోతోంది.