Native Async

ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ చిరంజీవి – విజయ్ సేతుపతి…

Megastar Chiranjeevi Meets Vijay Sethupathi
Spread the love

మెగాస్టార్ చిరంజీవి – విజయ్ సేతుపతి మధ్య ఉన్న మంచి అనుబంధం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి సైరా నరసింహారెడ్డిలో నటించిన తర్వాత ఇప్పటికీ ఆ బంధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఒకే స్టూడియోలో జరుగుతున్న షెడ్యూల్ కారణంగా యాదృచ్ఛికంగా కలుసుకోవడం ఫిల్మ్ సర్కిల్స్‌లో హైలైట్‌గా మారింది.

చిరంజీవి ఈసారి సూట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించగా, విజయ్ సేతుపతి మాత్రం లుంగీ స్టైల్‌లో మాస్ లుక్‌తో అలరించారు. ఆ కాంబినేషన్ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి – నయనతారలపై పాటను చిత్రీకరిస్తుండగా, మరోవైపు విజయ్ సేతుపతి – పూరీ జగన్నాథ్ మూవీకి సంబంధించిన కీలక సీన్స్‌ని టబు, ఇతర లీడ్ క్యాస్ట్‌తో షూట్ చేస్తున్నారు.

ఇక చిరంజీవి – టబు మధ్య ఉన్న బంధం అందరివాడు సినిమా రోజుల నుంచే ప్రత్యేకమే. ఈ ఫ్రేమ్‌లో వారిద్దరి మధ్య ఉన్న ఆప్యాయత మళ్లీ కనబడింది.

ఈ సందర్భంలో దర్శకుడు అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్, నయనతార, చార్మీ కౌర్, వీటీవీ గణేష్ లాంటి వారు కూడా ఆ ఫ్రేమ్‌లో కనిపించారు. మొత్తానికి మెగాస్టార్, విజయ్ సేతుపతి కాంబినేషన్ మరోసారి టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

ఈ న్యూస్ నిర్మాతలు ట్విట్టర్ లో షేర్ చేస్తూ, వారి ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit