రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా చుట్టూ అద్భుతమైన పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో బజ్ create చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా రామ్ రాసిన పాట, రామ్ స్వయంగా పాడిన మరో పాట – రెండూ సూపర్ హిట్ అయ్యి చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.
ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ ఆనందంతో మునిగిపోయింది. తాజాగా ప్రముఖ నటుడు ఉపేంద్ర జన్మదినం సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఉపేంద్ర లుక్ స్టైలిష్‌గా, స్లీక్గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆయన పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమైందని, చూడగానే ప్రేక్షకులను ఆశ్చర్యపరచేలా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమా లో ఉపేంద్ర హీరో పాత్ర లో నటిస్తుంటే, రామ్ అతని ఫ్యాన్ గా కనిపించనున్నాడు… ఉపేంద్ర బర్త్‌డే సందఱంహంగా, రామ్ కూడా సోషల్ మీడియా లో ఉపేంద్ర కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు…
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఒక ముఖ్యమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో రామ్‌తో పాటు వందలాది మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో భగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా స్క్రిప్ట్‌ని రూపొందించామని దర్శకుడు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.