Native Async

OG కాన్సర్ట్ లో పవన్ కళ్యాణ్…

Pawan Kalyan’s Powerful Speech at OG Pre-Release Event
Spread the love

అబ్బా హైదరాబాద్ అంతా పెద్ద వాన… కానీ ఒక వైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్… ఇంకో వైపు పవన్ కళ్యాణ్ OG ట్రైలర్ ఇంకా కాన్సర్ట్ ఈవెంట్. ఎక్కడ, ఏది చూడాలి అని అనుకునేలోపు, వరుణుడు నేను ఉన్న అని వచేసాడు…

అయినా కానీ OG ఈవెంట్ పెద్ద వాన లో కూడా జరుగుతుంది… గొడుగులు వేసుకుని మరి ఫాన్స్ పవన్ కోసం వెయిట్ చేసారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా తనకి ఫాన్స్ ముఖ్యం అని, అంతే చక్కగా మాట్లాడాడు… మరి మన డిప్యూటీ CM aka ఓజాస్ గంభీరా ఎం మాట్లాడారో విందామా:

‘‘సుజీత్‌ చెప్పేది తక్కువ. కానీ, సినిమా తీసేటప్పుడు మామూలుగా ఉండదు. ఈ సినిమాకు ఎక్కువ క్రెడిట్‌ అతడికే దక్కుతుంది. సుజీత్‌ విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్‌. ఈ ఇద్దరూ ఒక ట్రిప్‌లో మూవీ చేశారు. అందులోని నన్నూ లాగారు. ఈ మూవీ చేస్తున్నప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయా. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? ‘ఖుషీ’లో ఈ ఖటానాను ప్రాక్టీస్‌ చేశా. దీని చుట్టూ కథ అల్లి సినిమాను రంజింపజేసేలా తీశారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్‌తో మంచి లవ్‌స్టోరీ తీశారు. ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారు. నేను ‘ఖుషీ’ అప్పుడు ఈ జోష్‌ చూశా. పాలిటిక్స్‌ వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నాననంటే అందుకు కారణం మీరే. సినిమా చేసేటప్పుడు అది తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. సుజీత్‌ నాకు జపనీస్‌ నేర్పించాడు. ఇలాంటి దర్శకత్వ టీమ్‌ నేను ‘జానీ’ చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లో వచ్చే వాడిని కాదు. తెలుగు వాడంటే ఆకాశం ఉరుముతోంది. అన్నింటినీ అధిగమించి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. శ్రియారెడ్డి, ఇమ్రాన్‌ హష్మి అద్భుతంగా నటించారు. భవిష్యత్‌లో ఏదైనా ప్రాజెక్ట్‌ చేస్తే, శ్రియారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా’’.

ఇది చాలదు పవన్ ఫాన్స్ కి… ట్రైలర్ ఇంకొంచం సేపట్లో మీముందు ఉంటుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *