కాంతారా… ఈ సినిమా గురించి చెప్పక్కరలేదు అనుకుంట… మరి అంత పెద్ద హిట్ అయ్యింది కదా. రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా మన సంప్రదాయాల ఆధారంగా తెరకెక్కిన village బ్లాక్‌బస్టర్. అతని నటన అద్భుతం! ఇప్పుడు అదే రిపీట్ చేయడానికి వస్తున్నాడు కాంతారా చాప్టర్ వన్ సినిమా తో…
నార్మల్ గా అందరు సినిమా హిట్ ఐతే సీక్వెల్ తో వస్తారు. కానీ రిషబ్ కాంతారా కి ప్రీక్వెల్ అంటే ముందు కథ తో రెడీ గా ఉన్నాడు. సినిమా దసరా సందర్బంగా అక్టోబర్ 2nd రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉండడం తో, ఈరోజు ట్రైలర్ ని కూడా లాంచ్ చేసేసారు…
సుమారు మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఒక పురాణగాధలా ప్రారంభమవుతుంది. శివుడు మాయమైన అడవిలో అతని కుమారుడు నిలబడిన దృశ్యం నుండి ఆరంభమైన ఈ కథ, మానవ లోభం, అధికారం, ప్రజల తిరుగుబాటు అనే అంశాలను మిళితం చేస్తూ సాగుతుంది. గతంలో రాజు ప్రజలపై ఎలా అణచివేశాడు? ఆ పరిస్థితుల్లో ఏ విధంగా విప్లవం జరిగింది? అనే అంశాలు విజువల్‌గా అద్భుతంగా చూపించబడ్డాయి. ప్రకృతి, జానపదం, ఆధ్యాత్మికత కలగలసిన ఈ లోకం కాంతారలో చూసిన అనుభూతిని మరింతగా పెంచుతుంది.
ట్రైలర్లో divine element కొంచెం తగ్గించి చూపించినా, అది ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని అనిపిస్తోంది. అసలు సినిమా కథ ని ఎక్కువగా బయట పెట్టకుండా, ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించడం కోసం తీసుకున్న స్మార్ట్ నిర్ణయమే ఇది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా లో, రిషబ్ శెట్టితో పాటు అనిరుద్ మహేశ్, షానిల్ గురు కలిసి స్క్రీన్‌ప్లేను రాశారు. రూపమందిస్తున్న విజువల్స్‌కి అర్వింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ ప్రాణం పోశాడు. సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించారు. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లాంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొత్తం మీద, కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ ఓ విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తూ అద్భుతమైన దృశ్యాలను చూపిస్తుంది. కాస్త నెమ్మదిగా కట్ చేసిన ఫీల్ ఉన్నా, అందులోని వాతావరణం మాత్రం మైమరిపిస్తుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ ప్రీక్వెల్పై ఇప్పటికే ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. కాంతార మాంత్రిక లోకాన్ని మరోసారి అనుభవించేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.