Native Async

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్

Mohanlal Honoured with Dadasaheb Phalke Award at 71st National Film Awards
Spread the love

భారతీయ సినిమాకి అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారత ప్రభుత్వము ఈ అవార్డును ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా ప్రదానం చేస్తుంది. సినిమాకు విశేష సేవలందించిన వారిని గుర్తించి ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు వెనుక స్ఫూర్తి, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే.

ఇలాంటి గౌరవాన్ని ఈ ఏడాది 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మలయాళ సినీ రంగానికి ప్రాణం పోసిన లెజెండరీ నటుడు మోహన్‌లాల్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న వారిలో అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన మోహన్‌లాల్, కేరళ రాష్ట్రానికి చెందిన రెండవ వ్యక్తిగా ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

తన స్పీచ్ లో మోహన్‌లాల్ ఎంతో వినయంగా స్పందించారు. “ఈ అవార్డు నాకు మాత్రమే కాదు, మొత్తం మలయాళ సినీ పరిశ్రమకే చెందింది. మన పరిశ్రమ సృజనాత్మకతకి, కష్టానికి ఇది ఒక గుర్తింపు. ఈ అవార్డు విన్న వెంటనే గర్వంగా, అదృష్టంగా అనిపించింది. ఇది మన సినిమాల గొంతుకకి ఇచ్చిన గౌరవం,” అని అన్నారు.

తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, “ఇది నా కల నెరవేరింది అనడం కాదు… అది మించిన అనుభూతి. ఈ గౌరవం నా కోసం మాత్రమే కాదు, దశాబ్దాలుగా మలయాళ సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ సమర్పణ. కవి కుమారన్ ఆసాన్ చెప్పినట్టుగా – ‘ఈ పువ్వు నేలపై పడిపోలేదు, అందాన్ని మిగిల్చింది’ – అలానే మన కళా వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది,” అని చెప్పారు.

తరువాత భారత ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, అలాగే జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా తాను సినిమాల్లో తన ప్రయాణాన్ని నిజాయితీతో, అంకితభావంతో కొనసాగిస్తానని మోహన్‌లాల్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *