ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠత ఉంటుంది కదా… కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్టు, మన టీం చెలరేగిపోతుంది. ఐతే ఆసియ కప్ లో గ్రూప్ స్టేజి లో, సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ ని ఓడించాము. కానీ ఫైనల్ లో ఓడిస్తే ఆ కిక్కె వేరబ్బా…
అటు బౌలింగ్ చేసేటప్పుడు, ఇటు బాటింగ్ చేసేటప్పుడు మన టీం కొంచం టెన్షన్ పెట్టింది కానీ, తొందరగానే ఆట మన వైపు తిప్పేశారు. ఈసారి శర్మ కాదు మన తెలుగోడు వర్మ తిప్పేసాడు మ్యాచ్…
అసలు ఆసియ కప్ లో అభిషేక్ తో పాటు అత్యంత విలువైన ప్లేయర్ మనోడే కదా! ఫైనల్ లో మూడు వికెట్స్ పడ్డాక కూడా, అదే జోరు తో పాకిస్తాన్ ని చిత్తూ చేసి, గెలిపించాడు.
అందుకే తెలుగు ఆటగాడు తిలక్ ని అందరు ఆకాశానికి ఎత్తుతున్నారు… ఎప్పుడెప్పుడు టీం ఇండియా కి వస్తుందా ఘన స్వాగతం పలుకుదామా అని అందరు వెయిటింగ్!
ఐతే, మన తిలక్ AP మంత్రి లోకేష్ కి ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చాడు… తన కాప్ ని సంతకం చేసి మరి మన మంత్రి గారికి ఇవ్వబోతున్నాడు. అలా సంతకం చేస్తున్న వీడియో ని లోకేష్ ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తూ, ఈ బహుమతి తనకి ఎంతో ప్రత్యేకమైనది అని అన్నాడు…
ఆ వీడియో మీరు చూసేయండి…
అబ్బా ఇండియా అంటే ఇండియా నే… ఆట లో అయినా battle ఫీల్డ్ లో అయినా మనదే పై చేయి అది మన PM మోడీ గారు కూడా ఒప్పుకున్నారు కదా!