Native Async

నేడు శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi Srisailam Visit 2025
Spread the love

ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరుకాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *